అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభింజిన స్పీకర్.. 1 y ago
AP: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో లాబీల్లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో మూడు అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేసింది. ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్ ను మంగళవారం సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉప శాసనసభాపతి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. సేంద్రియ కాఫీ పొడి అయినందున ప్రత్యేక రుచి వచ్చిందని నేతలు అభిప్రాయపడ్డారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి జీసీసీ ఉత్పత్తులను ముఖ్యమంత్రికి బహూకరించారు.